మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్

  • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • ప్రధాని మోదీతో తన అనుభవాలపై 'అప్నాపన్' పేరుతో రచన
  • ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్
  • మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ
  • కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలను కలిసిన లోకేశ్
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం, అనుభవాల గురించి వివరిస్తూ చౌహాన్ 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్సెస్‌ విత్ నరేంద్ర మోదీ' పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఢిల్లీలోని పూసాలో ఉన్న ఐకార్ క్యాంపస్‌లో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ పుస్తకాన్ని మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొని పలువురు జాతీయ స్థాయి నేతలను కలిశారు. 

ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలు, ఆయన వ్యక్తిత్వం, ప్రజలతో మమేకమయ్యే తీరును ఈ పుస్తకం చక్కగా వివరిస్తుందని వక్తలు ప్రశంసించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ తరఫున లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Nara Lokesh
Shivraj Singh Chouhan
Apnapan My Experiences with Narendra Modi
Narendra Modi
Book Launch
Delhi
Andhra Pradesh
TDP
H.D. Deve Gowda
M. Venkaiah Naidu

More Telugu News